Article Search

సంక్రాంతి అంటే ఏమిటి.?
సంక్రాంతి అంటే ఏమిటి..? పండగ విశిష్టత ఏంటి..? దేశంలో ఎలా జరుపుకుంటారు..?మకర రాశిలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణించిన సనాతన హైందవ సంస్కృతిలో ప్రకృతి పరిశీలన, దాని ప్రభావాల అధ్యయనం కనిపిస్తాయి. దీనికి ముందు  సూర్యుడు మకరం రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఈ పర్వదినాన్ని భారత్ లో అందరూ జరిపుకుంటారు. తెలుగవారికి సంక్రాంతి, తమిళులకు పొంగల్ పేరు ఏదైనా పండుగ ఒకటే. దీనికి ముందు వెనుక కాలాన్ని పుణ్యతమమని ధార్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. మంచి పనికి కాలంతో పనిలేదనే సిద్ధాంతాన్ని పక్కనబెడితే, కొన్ని కాలాల..

మకరసంక్రాంతి

సూర్యుడు మకరరేఖ నుండి ఉత్తర కర్కాటక రేఖ వైపు ప్రయాణించడాన్ని 'ఉత్తరాయణం' అని, దక్షిణంలో మకరరేఖ వైపు ప్రయాణించడాన్ని 'దక్షిణాయనం' అని వ్యవహరిస్తారు. ఉత్తరాయణం ఆరు నెలలలో సూర్యుడు మకరరేఖ నుండి మిథునం వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. దక్షిణాయనం ఆరు నెలలలో సూర్యుడు కర్కాటకరాశి నుండి ధనుస్సురాశి వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. భగవద్గీత ఏం చెబుతుందంటే … 'ఉత్తరాయణం ఆరు మాసాలలో దేహం త్యజించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మను చేరుకుంటారు' అని. అందుకే భీష్మపితామహుడు కూడా ఉత్తరాయణ కాలం వచ్చే వరకు వేచి చూసి దేహత్యాగం చేశాడు.

మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప కోసం

మకర సంక్రాంతి రోజున సూర్యుడి కృప పొందడానికి 'భాగ్యోదయ సాధన' వల్ల సాధకుడు సూర్యుడికి కృపాపాత్రుడు అవుతాడు. ఈ సాధన ఎలా చేయాలంటే … సూర్యోదయానికి పూర్వమే స్నానాదికాలు పూర్తిచేసుకుని సూర్యుడిని స్మరించుకుని, నమస్కరించాలి. శుభ్రమైన తెల్లని వస్త్రాలు ధరించాలి. ఒక రాగిపాత్రలో నీటిలో నీళ్ళు పోసుకుని సూర్యుడికి మూడుసార్లు అర్ఘ్యం ఇవ్వాలి.

మకర సంకక్రాంతి రోజున విష్ణు నృసింహ సాధన విధానం

శ్రీమహావిష్ణువు దశావతారాలలో నాలుగవ అవతారం నృసింహస్వామి నృసింహస్వామి రూపాన్ని నేటి రోజులలో సాధన చేయడం ఎంతో శ్రేష్ఠం. అందులోనూ మకరసంక్రాంతి రోజుల చేయడం మరింత శ్రేష్ఠం. ఈ రూపంలో నృసింహస్వామి ఒకవైపు సౌమ్యత, మరొక వైపు పరాక్రమం ఉంటుంది. నృసింహస్వామి సాధవ చేయడంవల్ల మూడు రకాల బాధలు దూరం అవుతాయి అని పండితులు చెబుతున్నారు.

Showing 1 to 4 of 4 (1 Pages)